| కీర్తనలు | తూము నరసింహదాసు | కుశలమా భద్రాచల నిలయుడు |
| యదుకులకాంభోజి (కన్నడ) - ఆది |
| పల్లవి: |
| కుశలమా భద్రాచల నిలయుడు |
| అనుపల్లవి: |
| కుశలమా రవికులు శుభవార్తలు విశదముగా వినవేడుక గల్గెను |
| చరణము(లు): |
| కుశలమా రఘుకులశేఖరునకు వసుధాత్మజయగు వారిజనేత్రకు |
| ప్రేమ రావణుని ప్రియసుతు దునిమిన స్వామి కోవిదుడు సౌమిత్రి కచటను |
| వనధి దాటి రఘువరుసతిఁ గనుగొని పని వినివచ్చిన పవనాత్మజునకు |
| భయముతోడ ద్వార - పాలకులై సుర చయము కెక్కుగగు జయవిజయులకు |
| పరమభక్తిగల భావజ్ఞులు శ్రీ వరుని స్వజనులగు వైష్ణవ నివహము |
| అరసి రాత్రి పగలనక యూడిగము వరుసఁజేయు పరివారములకు నెల్ల |
| జనన మరణములు సరకుగొనక హరి గనుగొని ధన్యతఁ గను నిజదాసులు |
| చుట్టుకోవెలల సొంపగుస్వాములు గట్టుపై వెలసిన ఘనులు నృసింహులు |
| అందముగా పురి ముందర నెలకొను సుందరమగు గోవిందరాజులకు |
| భూజములును వరపుణ్య గౌతమియు రాజిల్లు నగరము రథగోపురమును |
| మేలివ్యజనములు మించు ఛత్రములు చాలుభేరియును సరసనవుపతులును |
| ఘనతరమగు పరికర యుగ్రాణము అనువుగ రామకల్యాణమంటపము |
| తరముగాని సుందరతచేత బహు విరివి గలుగు గోపురచక్రమునకు |
| పోకబత్తి మల్లెపూ బొదరిండ్లను శ్రీకరమగు తులసీ వనములకును |
| రంగుగ పైడిచెరంగు పుటముగల అంగజనిభుడగు రంగనికిని బహు |
| రామనామ మధురామృత సారము ప్రేమగ్రోలు శ్రీరామలింగునకు |
| మొనసి దాసులకు మోక్షమిచ్చుటకు దనరియున్న ద్వాదశి మంటపమును |
| సంపద లొసగెడు స్వామి సీతయును యింపొందెడు పవళింపు గృహమునకు |
| లీల భద్రగిరి నేలు రాఘవు శాలార్థము కరి హయ చయములకును |
| తప్పక జనకజ స్థానమునకు కడు నొప్పగుచుండెడు నుష్ణజలములకు |
| సారరహిత సంసారపయోనిధి మీరి దాటుటకు మెలగు నావలును |
| చెలగి తూము నరసింహదాసునకు బలుప్రాపగు శ్రీభద్రగిరీశుఁడు |