కీర్తనలు తూము నరసింహదాసు దర్శన మదిగో భద్రాచల దర్శన మదిగో
ధన్యాసి - రూపక (ఆట)
పల్లవి:
దర్శన మదిగో భద్రాచల దర్శన మదిగో
దర్శన మదిగో శ్రీహరికి మందిరమై
సిరిగలిగి వెలసెడి, గిరిసత్తముని యొక
చరణము(లు):
తళతళత్తళలు దిక్తటములఁ బ్రసరింప
లలితమైన కాంతి గలిగిన గోపుర
పరమ పతితులను బావనులుగఁజేయు
హరిమందిరముపై మెరయుచుండెడి చక్ర
ధరణిలోపల తూము నరసింహదాసుని
దొర యేలు శ్రీభద్రగిరి యుత్తముని యొక్క
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - darshana madigoo bhadraachala darshana madigoo - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )