| కీర్తనలు | తూము నరసింహదాసు | ధన్యోహం బన గల్గెను నేడుగదా! |
| పూర్ణచంద్రిక - చాపు |
| పల్లవి: |
| ధన్యోహం బన గల్గెను నేడుగదా! |
| అనుపల్లవి: |
| ధన్యోహం బనగల్గె దశరథ తనయుని దర్శనమున భవతాపత్రయము వీడి |
| చరణము(లు): |
| తీరైనహేమ ప్రాకారగోపురములు చేరువ గౌతమి పాఱుట గని నేడు |
| భక్తజనుల నెల్ల ప్రార్థించి వారల పదరేణువుల పైని వెదజల్లుకొనుటచే |
| రామచంద్రుడు దివ్యరత్న పీఠమునందు రాజీవాక్షిని గూడి రంజిల్లుట గని |
| కనుగొంటి భద్రాద్రి ఘనమైన తోరణ తృణ గుల్మాదులచేత దేజరిల్లగను |
| ధరణిలో నరసింహ దాసుడనగ నేడు దగియుంటి నని మది దగిలి యుప్పొంగి నే |