| కీర్తనలు | తూము నరసింహదాసు | ఇటువంటిసేవ మన, కెందైనఁ గలుగునా |
| బిలహరి - రూపక |
| పల్లవి: |
| ఇటువంటిసేవ మన, కెందైనఁ గలుగునా పటుతరమైన రాఘవ ప్రభుసన్నిధినే గాక |
| చరణము(లు): |
| తేటకస్తురి నుదుట - నీటు గులుకుచుండ హాటకాంబరుడైన శ్రీ - హరి సభయందునెగాక |
| ఆడుచు నాదమున - బాడుచు నెదుటను వేడుచు నామది - గూడియుండుటె చాలు |
| వాసిగ భద్రశైల - వాసుని దాసాను దాసుడౌ నరసింహ - దాసావనుని గనకున్న |