కీర్తనలు తూము నరసింహదాసు చెలియ శ్రీరామచంద్రుని సేవ జేతామా
ఆనందభైరవి (కన్నడ) - ఆది
పల్లవి:
చెలియ శ్రీరామచంద్రుని సేవ జేతామా
మన కరవుదీఱ రాములతోడఁ గలసి యుందామా
చరణము(లు):
భక్తజనులతోడ గూడి పాడుచుందామా, యొక
యుక్తిలోనె ముక్తికాంతమెప్పు గందామా
అఘములన్ని పారజిమ్మి సుఖము గందామా, మన
రఘుకులాబ్ధిసోము నిందు రా రమ్మందామా
సాధుజనవాదుఁడని చాటుచుందామా, జగ
న్నాథుఁ డితడని మదిలో నమ్మియుందామా
భద్రాచలేశుని పాదముఁ బట్టుకుందామా, పట్టి
భద్రముగ మదిలోనఁ బెట్టుకుందామా
దాసవైరులతో బొందుఁ బాసియుందామా, మనము
డాసి తూము నారసింహుని వాసిఁ గందామా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - cheliya shriiraamachaMdruni seeva jeetaamaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )