| కీర్తనలు | తూము నరసింహదాసు | పరాకు |
| ముఖారి - ఆది |
| చరణము(లు): |
| రాజకుమార పరాకు - రఘు - రామ! శ్రీరామ పరాకు రాజీవనేత్ర పరాకు - భక్త - రాజీవమిత్ర పరాకు కాకుత్స్థతిలక పరాకు - నవ - కస్తూరితిలక పరాకు కందర్ప జనక పరాకు - భక్త - కాయ మునిగేయ పరాకు యిందువదన పరాకు - దశ - స్యందననందన పరాకు భద్రాద్రినిలయ పరాకు - రామ - భద్ర సురేశ పరాకు రుద్రాదివినుత పరాకు - లోక - క్షుద్ర సంహార పరాకు నరసింహపోష పరాకు - జగ - న్నాథ మహాత్మ పరాకు మహారాజ కుమార పరాకు - రఘు - రామ శ్రీరామ పరాకు |