| కీర్తనలు | తూము నరసింహదాసు | స్వారి వెడలెను - రాముఁడు స్వారి వెడలెను |
| మధ్యమావతి - ఆది (చాపు) |
| పల్లవి: |
| స్వారి వెడలెను - రాముఁడు స్వారి వెడలెను సారసభవ రుద్రామరు లెల్లను - జేరికొల్వ శృంగారముగా నిదె |
| చరణము(లు): |
| కనకకిరీటకాంతి మీర ముంగురులు జార! కస్తూరి తిలక మింపుగులుక కనుగొనలను కృపఘనముగ చిలుకగ దనరిన చిరునవ్వున సుధ గులుకగ |
| కంబుకంఠమునందు మంచికౌస్తుభమణి ముదంబున కాంతితోడ మించి డంబుగ వెడద యురంబున సుమణియుతంబగు భూషణతతి ఘృణులీన |
| బంగారు చాయ పటముతోడ మేఘాల ప్రభలు శృంగారముగ మేలమాడ రంగుగ శ్రీపదరాజీవములు చెలంగగ బుధజనసంగతి వెదకుచు |
| శరచాపములు యిరుకేల గురుతుగ దాల్చి తురగారూఢుడై యింపుమీర దొరతన మంతయు గురుతుపడగను సరస లక్ష్మణుఁడు సంభాషింపగ |
| భూరిమహిమ సొంపుమీర భద్రాచల విహారుఁడు వనమునందు జేర నారసింహదాసావను డితడని కోరి జనములు చేరి కొల్వగను |