కీర్తనలు తూము నరసింహదాసు చూడరె మీరు సుదతులార - చూడరె మీరు
కాంభోజి - ఆట
పల్లవి:
చూడరె మీరు సుదతులార - చూడరె మీరు
భావము నిల్పి చూడరె మీరు - వేడుకలర రామవిభుని యొయ్యారము
చరణము(లు):
స్వారివెడలి స్వామి వేంచేసెను - కోరి కుంకుమరస హారతు లందిచ్చి
కమలముపై మంచుకణములవలె మించి - శ్రమబిందు కణములు చాల మోమున గ్రమ్మె
తాళవృంతములను తరుణులందరు గూడి - వేళచల్లగాను వీచుచు కన్నెత్తి
జారు కురులు కస్తూరి తిలకమును - తీరైన చూపులు దేరి కన్నులనిండ
మీరి భద్రాద్రి విహారుఁడు నేడిదె - నారసింహుని బ్రోవ నాథుఁడై వేంచేసె
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - chuuDare miiru sudatulaara - chuuDare miiru - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )