కీర్తనలు తూము నరసింహదాసు పూజ సేయుచునుండరే శ్రీరాముని
ఆనందభైరవి - ఆది
పల్లవి:
పూజ సేయుచునుండరే శ్రీరాముని
అనుపల్లవి:
పూజసేయరె హృత్సరోజ పీఠమునందు
రాజకుమారుఁడౌ రఘుకులోత్తంసుని
చరణము(లు):
గంధపుష్పములచే గడువేడ్కతో భవ
బంధవిమోచను పదపద్మములయందు
వురిమింజి ముత్యాల సరములు మెడనిండ
ధరియించి నిరతము గుఱిగా మానసమున
ధూపదీపము లిచ్చి గోపాలదేవుని
ప్రాపే నమ్మితిమని యోపికతో మీరు
మంచి మీగడపాలు పంచదారయుఁ గూర్చి
మించినభక్తి నర్చించి శ్రీరాముని
భరితమౌ భద్రాద్రిపురమున నెలకొన్న
శరణాగతత్రాణ బిరుదు గల్గినస్వామి
హరిహరులకు దాసుండనగ బరగి తూము
నరసింహదాసు నేమరకుండుస్వామిని
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - puuja seeyuchunuMDaree shriiraamuni - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )