| కీర్తనలు | తూము నరసింహదాసు | దృష్టి తాకెనేమో దివ్యమణులు చుట్టి ద్రిప్పి వెయ్యరె ప్రేమమీరను జగ |
| పున్నాగవరాళి - చాపు |
| పల్లవి: |
| దృష్టి తాకెనేమో దివ్యమణులు చుట్టి ద్రిప్పి వెయ్యరె ప్రేమమీరను జగ త్సృష్టికర్తయైన సుందరాకారునికి - చూపులబడలికదీరను - చెలి |
| చరణము(లు): |
| బంతులాడగ శ్రీమంతుని సీతను - వింతగ జూచిరి జాణలు చెలి కాంతుని మించిన ఘన సుందరము జూచి - కామించి మీటిరి వీణెలు చెలి |
| కన్నులపండువుగాను సీతాపతిని గాంచిరి యువిదలు మ్రోవను మంచి పున్నమచందురు బోలు మోము వాడి యున్నది నేడు జాగేలను చెలి |
| బాలుడు భద్రాద్రిపాలుడు సీతావిలోలుడు రఘుభూపాలుడు మంచి తాలిమి నరసింహదాసుని రక్షించు నీలంపుకాంతి విశాలుడు చెలి |