| కీర్తనలు | తూము నరసింహదాసు | చూచి సేవింతము రారే -శ్రీరాములను - జూచి సేవింతము రారే |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| చూచి సేవింతము రారే -శ్రీరాములను - జూచి సేవింతము రారే రాచవాడైన కమలలోచను పదపద్మములు |
| చరణము(లు): |
| సీతతోడుత రత్న సింహాసనమందుఁ జేతో మోదంబుతోడఁ జెలువొందు రామచంద్రుని |
| రాతి నాతిగఁ జేసి - వాతాత్మజుని మదికిఁ బ్రీతి నొసగినట్టి - సీతేశు పదపద్మములు |
| బంగారు మంటపాంతరంగమున ను ప్పొంగి కూర్చున్న రఘు - పుంగవు పదపద్మములు |
| సంగతితోడ మౌని పుంగవులెల్ల సత్ప్ర సంగముసేయ విను - సీతాంగన పదపద్మములు |
| ఛత్రచామరులు సుమిత్రాత్మజాదు లెల్లఁ బాత్రలై దశరథ - పుత్రుని పదపద్మములు |
| రుద్ర ప్రముఖులెల్ల - భద్ర మనుచు గొల్వ భద్రాచలేశు పదపద్మము లేమఱక |
| సారసనేత్రు తూము - నారసింహదాసునిఁ జేరి బ్రోచెడు రఘువీరుని పదపద్మములు |