| కీర్తనలు | తూము నరసింహదాసు | దొరవలె గూరుచున్నాఁడు భద్రగిరి నాథు డితఁ డేమొ చూడు |
| కాఫీ - ఆట (భైరవి - ఆది) |
| పల్లవి: |
| దొరవలె గూరుచున్నాఁడు భద్రగిరి నాథు డితఁ డేమొ చూడు మెఱుపైన చామంతి విరులదండలు చాలముఱియుచు ధరియించి ముదిత సీతను గూడి |
| చరణము(లు): |
| పురుమంజి ముత్యాల సరులు కెంపుల తాళి మెఱయుచు నుండగఁ జిరునవ్వు మొగముతో |
| కాంచనచేలముఁ గనక కిరీటము లాంఛనములు గల లక్ష్మణాగ్రజుఁడిదె |
| విరుల చప్పరమునఁ బరమ భక్తులు గొల్వ నరసింహదాసుని నరసి ప్రోచుఁటకు |