| కీర్తనలు | తూము నరసింహదాసు | కట్టి వేయగదరే శ్రీరాముల గట్టిగ మదిలోనను |
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.
| కాంభోజి - చాపు |
| పల్లవి: |
| కట్టి వేయగదరే శ్రీరాముల గట్టిగ మదిలోనను కట్టి వేయరె మీరు దిట్టముగా యోగ పట్టాభిషిక్తుని పట్టు వదలకుండ |
| చరణము(లు): |
| గుఱి యను స్తంభము భక్తియనెడు మురిపెంపు పురిత్రాటను స్థిరమైన హృత్పద్మవర సదనములోన నొరులు రాకుండ గరిమ శ్రీరాముని |
| చూడ రూపము లేదటే వానితో మాటలాడ శక్యముగాదటే చేడియ యికనైన జాడవెదకి వాని తోడి తెచ్చి మీవాడ వదలకుండ |
| ఊరుపేరు లేదుగా మనలో ఆత్మాకారుడై విలసిల్లుగా సారసాక్షి మున్ను ధీరుఁడై గోపిక లారడిఁ జేసిన చోరుండు వీడటె |
| వారిజాక్షి చూడవే యీ చిన్మయాకారుని గన నేరవే వేఱులేక తూము నారసింహునియింట భారకుండై యున్న సారసనాభుని |