కీర్తనలు తూము నరసింహదాసు పూజ సేయరే బంగరుపూల, పూజసేయరే
ముఖారి - ఆట
పల్లవి:
పూజ సేయరే బంగరుపూల, పూజసేయరే
పూజ సేయరే రాజ రాజతనూజుని, రవికోటితేజుని రామునిపదములకు
చరణము(లు):
సారసగంధులు సారసములు దెచ్చి
సారసాక్షుని పాదసారసములకును
తుంటవిల్తుని గన్న తోయజధరునకు
అంటినభక్తి గోరంట పువ్వులు దెచ్చి
వింతగాను చేమంతిపువ్వుల శ్రీ
మంతుడైన లక్ష్మీకాంతుని పదములు
జలజాక్షు లందఱు జలధరదేహుని
సలలితముగ లక్ష్మీతులసి దళములను
వాసిగ భద్రాద్రి వాసుండు నరసింహ
దాసుని హృదయ నివాసుండై యున్నాడు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - puuja seeyaree baMgarupuula, puujaseeyaree - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )