| కీర్తనలు | తూము నరసింహదాసు | చల్లరె రామునిపై పూలు చల్లరే |
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.
| కాంభోజి - ఆట |
| పల్లవి: |
| చల్లరె రామునిపై పూలు చల్లరే చల్లరె విరజాజులు లాజలు మల్లెలు మొల్లలు మంచి సంపెంగలు |
| చరణము(లు): |
| సీతాసమేతుని ఖ్యాతి వినుతిచేసి బ్రీతితోడ బారిజాత కుసుమములు |
| సలలితముగ భక్తి చాల దీపింపగ మొలక వెన్నులుగల తులసిదళములు పైన |
| నీరుగన్నేరు పన్నీరు తీరు వకుళ సారస దవన బంగారు పుష్పములు |
| వాసిగ నరసింహదాసుని హృదయ ని వాసుఁడౌ శ్రీ శ్రీనివాసునిపైఁ బూలు |