| కీర్తనలు | తూము నరసింహదాసు | ఆరగించవయ్య రాఘవ అతివతోడను నేరములెంచక |
| యదుకులకాంభోజి - ఆట |
| పల్లవి: |
| ఆరగించవయ్య రాఘవ అతివతోడను నేరములెంచక ఆరగింపవయ్య మంచి అరటి పండులు చెఱకు పానక |
| చరణము(లు): |
| దోరమామిడి ఫలములు పనసతొనలు మంచి తేనెచెక్కెర |
| ఊరుగాయ పెరుగు చలిది తీరు పులియోగిరము తిరువీన |
| పాలు మీగడ కండ చక్కెర బంగరు గిన్నెలతోడ నే |
| దాసమానసాంబుజ వికాస శ్రీభద్రశైల నివాస నీ |
| భూసుతాధిప నారసింహ దాసపోషక దాశరథే |