| కీర్తనలు | తూము నరసింహదాసు | పవళింప వేంచేయ సమయము రామ |
| శంకరాభరణము - ఆట |
| పల్లవి: |
| పవళింప వేంచేయ సమయము రామ పసిడి పాదుక లూని పడతి సీత కేలూని |
| చరణము(లు): |
| రసికజనులు గొల్వ రత్నపాదుక లూని వసియింప వేంచేయు సమయము |
| ముసిముసి నగవుల మోహనాకారుఁడై ముదమున వేంచేయు సమయము |
| దశరథాత్మజుఁ డిదె దయతోడ నరసింహ దాసుని ప్రార్థన దద్దయుఁ జేకొని |