| కీర్తనలు | తూము నరసింహదాసు | పవళింపవయ్యా! రామయ్య! పవళింపవయ్యా! |
| శ్రీ - ఆట |
| పల్లవి: |
| పవళింపవయ్యా! రామయ్య! పవళింపవయ్యా! |
| అనుపల్లవి: |
| పవళింపుమీ శేషపర్యంకమందున కవగూడి సేవక గణములు గొల్వగ |
| చరణము(లు): |
| సొంపైన యువిదలగుంపున వీణవా యింపు లాలింపుచు నింపొందుసతి గూడి |
| చిలుకల కొలుకులు కులుకుతియ్యని ముద్దు పలుకు లాలింపుచు పణతి సీతను గూడి |
| తిరముగ సాకేత పురమున నెలకొని నరసింహదాసుని నరసిప్రోచెడుస్వామి |