కీర్తనలు తూము నరసింహదాసు పవళించెనమ్మా! శ్రీరాములు! పవళించెనమ్మా!
శ్రీ - ఆట (చాపు)
పల్లవి:
పవళించెనమ్మా! శ్రీరాములు! పవళించెనమ్మా!
అనుపల్లవి:
పవళించినాడమ్మ పన్నగాధిపు పైని
పంకజనాభుఁడు పడతి సీతను గూడి
చరణము(లు):
ముంగురులును జార ముసిముసినగవుల
ముచ్చటలాడుచు ముద్దుల మాతండ్రి
తళ్కు కస్తురిబొట్టు కులుకుచు నుండగ
దాసుల హృదయ నివాసుడై నే డిదె
వాసిగ భద్రాద్రి వాసుని సన్నిధి
దాస వరదరామదాసుఁడు గొల్వగ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - pavaLiMchenammaa! shriiraamulu! pavaLiMchenammaa! - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )