కీర్తనలు తూము నరసింహదాసు నిద్దుర బుచ్చరే శ్రీరాముని నిద్దుర బుచ్చరే
ముఖారి - ఆట
పల్లవి:
నిద్దుర బుచ్చరే శ్రీరాముని నిద్దుర బుచ్చరే
అబుపల్లవి:
నిద్దుర బుచ్చరే ముద్దియ లందఱు
సద్దికతో జేరి ముద్దులరాముని
చరణము(లు):
మేలిమి యగునట్టి డోలికయం దుంచి
నీలనీరదవర్ణు జోలల పాడుచు
వాటముగా మంచిబోటులుచే వీణె
మీటుచు మేలెంచి పాటలు పాడుచు
పంకజనేత్రుని సంకీర్తనలు మీ
రంకించి పాడుచుఁ బంకజముఖులార
తీరుగ భద్రాద్రి చేరువ గౌతమి
తీరమునను యిరవార వెలయువాని
వేరుసేయక తూము నారసింహుని బ్రోవ
భారకుడౌ రఘువీరుని నేడిదె
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - niddura buchcharee shriiraamuni niddura buchcharee - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )