కీర్తనలు తూము నరసింహదాసు నీరాజన హారతి
నీరాజన హారతి
హారతి శ్రీశశిశోభితాననాయై జయ
హారతి త్రైలోక్య పరమ పావనాయై
కుంకుమ పంకిల వక్షాంకాయై
కరకంకణ కేయూరవిహారాయై
చారుహీరతరాంచిత హారాయై
శ్రీమన్నారాయణ వక్షవిహారాయై
హాటకాంబర భూషణాలంకృతాయై
శతకోటి భానుతేజనిభ కిరీటాయై
నారదాది మౌనిబృంద వందితాయై
దివ్యవరచింత చరితానందితాయై
భాసుర శ్రీభద్రగిరి నివాసాయై
రామదాస పోషక విహారాయై
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - niiraajana haarati - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )