| కీర్తనలు | తూము నరసింహదాసు | నిద్దుర బుచ్చవే రాముని నీవు మంచి సుద్దులు చెప్పవే భామిని |
| యదుకులకాంభోజి - ఆట |
| పల్లవి: |
| నిద్దుర బుచ్చవే రాముని నీవు మంచి సుద్దులు చెప్పవే భామిని ప్రొద్దు చాలబోయె రద్దు వలదిక నొద్దికతో చేరి ముద్దియరో నేడు |
| చరణము(లు): |
| కనకంపు తొట్లలోనను సొంపుమీరగ వినయంపు మాటల మనసు రంజిల్ల జేసి |
| కెందమ్మి సుమముల చందము గేరుమో మందము గలవాని సుందరీమణీ నీవు |
| శ్రీకరముగ నరసింహుని రక్షించు పాకారి వినుతుని భద్రాద్రీశుని |