| కీర్తనలు | తూము నరసింహదాసు | నిదుర బోనియవె రాముని! సీతమ్మ నీవు! నిదురబోనియవె రాముని! |
| ముఖారి - ఏక |
| పల్లవి: |
| నిదుర బోనియవె రాముని! సీతమ్మ నీవు! నిదురబోనియవె రాముని! నిదుర బోనియవె రాముని! మదవతి వానిమనసు రంజిల్ల! |
| చరణము(లు): |
| భండనమున బలుదండి దానవులను ఖండించి బడలె వేదండయాన యిక |
| ప్రక్కను జేరి వాని చెక్కిలి నొక్కుచు చక్కగ మరుకేళిఁ జొక్కించకను నిక |
| పొందుగ భద్రాద్రియందు వెలయు రఘు నందనుని సేవ నంది సేయు వేగ |
| కులుకు గుబ్బల తళుకుఁ జూపకే అలుకఁ జేయవే అలినిభవేణి |
| నేరుపుతో తూము నరసింహుని వెంట జేరి తిరిగి నిదుర జాలకయున్నాడు |