| కీర్తనలు | తూము నరసింహదాసు | సందడి సేయవలదు రాకురే! సుందరులార! |
| శంకరాభరణము - ఏక |
| పల్లవి: |
| సందడి సేయవలదు రాకురే! సుందరులార! |
| చరణము(లు): |
| సందడి సేయవలదు శ్రీరఘు నందనుడు నేడు సీతా మందయానతోడఁ గూడి పొందు సలుపుచున్న వేళ |
| ఇందువదనలార మీరు మంద మందమునను పాట లుండి పాడనేల శ్రీ గోవిందుడు నిదురించువేళ |
| వేణు వీణానాద మిపుడు వెలదులార సేయవలదు జాణుడై రామచంద్రుడు చెలియతో శయనించెను |
| నీరజాప్తకులునిఁ జేరి నారసింహదాసు డిపుడు ధీరుడై పదములొత్తుచు గోరి కీర్తన సేయువేళ |