| కీర్తనలు | తూము నరసింహదాసు | హెచ్చరికై యుండుడీ దిక్పతులార |
| మోహన - చాపు |
| పల్లవి: |
| హెచ్చరికై యుండుడీ దిక్పతులార |
| అనుపల్లవి: |
| హెచ్చరికై యుండు డెలమి రాముండు నే డిచ్చట సీతతో నింపొంద శయనించె |
| చరణము(లు): |
| పూలపాన్పుపైని పుండరీకాక్షుండు వాలాయముగ నేడువసియించి యున్నాడు |
| భక్తజనములు గూడి పదములు పాడఁగ బంకజనాభుఁడు పవళించి యున్నాడు |
| కూరిమితో తూము నారసింహుని మదిఁ జేరి రాముఁడు శేషశయనుఁడై యున్నాడు |