కీర్తనలు తూము నరసింహదాసు మేలుకో సుగుణాలవాల జానకిలోల భక్తపాల నిదుర మేలుకో
(మేలుకొలుపు) భూపాళ
పల్లవి:
మేలుకో సుగుణాలవాల జానకిలోల భక్తపాల నిదుర మేలుకో
వాలాయముగ నన్ను పాలించువేళాయె వైకుంఠవాసుడ మేలుకో
చరణము(లు):
భేరి మృదంగాది భీషణవరములు భోరుగలుగ సాగెమేలుకో
తీరైన కస్తూరి తిలకము జారెను తీర్చి దిద్దవలె మేలుకో
తారలు తెల్లనై తెల్లవారెనదె వారిజాక్ష యికమేలుకో
తీరైన ముత్యాలహారమువలె దీపతేజము గన్పడె మేలుకో
తూరుపునను మంచితీరుగ రవికాంతి జేరిమించసాగె మేలుకో
కారుణ్యసాగర కమనీయ కటిసూత్ర హారమకుట ధరమేలుకో
భరతుఁడు మీపాద భక్తుడు శ్రీమించు పాదుకలను దెచ్చె మేలుకో
వరదుడవై నీవు ధరణిజఁగూడి యీధర యేలుదువుగాని మేలుకో
స్థిరముగ భద్రాద్రి పురమున వెలసిన శ్రీరఘునాయక మేలుకో
నరసింహదాసుని యరలేక రక్షించు పరమపావన నీవు మేలుకో
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - meelukoo suguNaalavaala jaanakiloola bhaktapaala nidura meelukoo - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )