కీర్తనలు తూము నరసింహదాసు నిద్రాముద్రాంకింతమైన కన్నుల నీటుఁ జూడ గల్గెను
ఆనందభైరవి - చాపు
పల్లవి:
నిద్రాముద్రాంకింతమైన కన్నుల నీటుఁ జూడ గల్గెను
అనుపల్లవి:
భద్రాద్రి నిలయ నాపాలి దైవమ రామ
భద్ర సీతామనఃపద్మభృంగ నీదు
చరణము(లు):
తళుకు ముంగురులచేఁ దిలకము మెఱయగ
కలికిచూపులు గుల్కగా
వలనొప్పుగా చంద్రవదనమందున నవ్వు మొలకలెత్తగ
ముద్దు ముఱియుచుండెడు నీదు
మదనుని విల్లన మహిమ దీపించు నీ మంచి కన్బొమలతీరు
సదమలమైన నీ చక్కని చెక్కిళ్ళు మొదలు మేఘముబోలు
మృదుగాత్రమున నీదు
వరహేమ మకుట పావనకుండలంబులు వైజయంతికమాలలు
కఱుకు బంగరుచేలకాంతులు దీపింప
నరసింహదాసు డేమరక సేవించు నీ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - nidraamudraaMkiMtamaina kannula niiTu.r juuDa galgenu - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )