కీర్తనలు తూము నరసింహదాసు పదరే సఖియలార మీరు పదరే చూతాము
యదుకులకాంభోజి - ఆది
పల్లవి:
పదరే సఖియలార మీరు పదరే చూతాము
సదయుడౌ రామునిపై పూలచెండ్లు వేతాము
చరణము(లు):
వెలది రామునిపైన బంతి వేయు వేళను
చిలుకలు కలకలమని చెలియ గూసేను
భామామణిపైన బంతి రాము డేయగ
కోమల పికములెల్ల గూయసాగెను
తాటంకములు గల తామరసాక్షి
నీటుగ రాముని బంతులాట చూతాము
ముత్యాలసరము లల్లాడ ముదితరాముఁడు
నిత్యానంద మొప్ప ఆడునేర్పు జూతాము
మీరి భద్రాద్రిని తూము నారసింహుని
జేరి ప్రోచు సీతాహృద్విహారుని జూడ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - padaree sakhiyalaara miiru padaree chuutaamu - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )