కీర్తనలు తూము నరసింహదాసు మంగళం రాధా భుజంగాయ వరవల్ల
(మంగళహారతి) భైరవి - జంపె
పల్లవి:
మంగళం రాధా భుజంగాయ వరవల్ల
వాంగనా సురత ప్రసంగాయ తే
మంగళం భవతు సర్వాంగ సౌందర్యసంగాయ సతత ని
స్సంగాయ తే మంగళం తే నిత్యశుభమంగళం
చరణము(లు):
జారాయ నవనీతచోరాయ భక్తాను
కారాయ సులభావతారాయ తే
ధీరాయ బుధజనోద్ధారాయ కైతవకి
శోరాయ మోహనాకారాయ తే
గోపాలకులరత్న దీపాయ దీపిత క
లాపాయ మృదుల కలాపాయ తే
పాపాదనోదనాయాపార సచ్చిత్స్వ
రూపాయ వీరప్రతాపాయ తే
నీలాలకాజాలఫాలాయ పాలిత కు
చేలాయ తపనీయచేలాయ తే
బాలాయ సుగుణాలవాలాయ సుమనోవి
శాలాయ వేణుగోపాలాయ తే
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - maMgaLaM raadhaa bhujaMgaaya varavalla - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )