| కీర్తనలు | తూము నరసింహదాసు | అంగజజనక సారంగనయన నీకు మంగళం జయమంగళం |
| (మంగళహారతి) సురట - జుల్వ |
| పల్లవి: |
| అంగజజనక సారంగనయన నీకు మంగళం జయమంగళం |
| అనుపల్లవి: |
| మునిజనములకు జీవనమనదగు పా వనమైన మీ పాదవనజములకు |
| చరణము(లు): |
| వనజమునను నాల్గుముఖముల బాలుని కనుగొన్న మీనాభికంజమునకు |
| అందముగాను యాయిందిర కిరవైన సుందరమైన పూదండ యురమునకు |
| సొగసైన కస్తూరిచుక్క వాసనలీన తొగరేని దెగడు నీనగుమోము దమ్మికి |