కీర్తనలు తూము నరసింహదాసు రామా నీ వెందున్నవాడవో భక్తరాజి రక్షణమును బూనవో
శంకరాభరణము - ఆట
పల్లవి:
రామా నీ వెందున్నవాడవో భక్తరాజి రక్షణమును బూనవో
సామరజనములు పండితజనములు - తామసజనములు తవిలి బాధింపగ
చరణము(లు):
నీసేవ నీపూజ నీనామస్మరణ నీపాదధ్యానము నిక్కమటంచు
(దు)డాసి భంగము సేయదలచి పిశాచములవలె నేడుకొల్పగ
జూచి చూడకయున్న నెక్కడనె జూతు మెవ్వరు దిక్కు సీతా
పరగ ప్రహ్లాదద్రౌపదిదంతివరులు బలిమివిభీషణాది సద్భక్తవరులు
(దు) మరియు నారదప్రముఖులెల్లరు నరసి నీచరణాబ్జములు గని
తరముగాని భవాబ్ధిదాటుట దలచి నమ్మితి దారి దెలియదు
శుకశౌనకాది వాసుకి సనందాది ప్రకట యోధులు నిన్ను బ్రార్థించి మించి
(దు) యొకటి బహుసులభమని భాగవతపురాణ సుధాబ్ధి ద్రవ్వి
రకట నే నది గాంచి వాంఛను నాసచే దప్పిగొని చేరితి
కలయోనులను బుట్టి కర్మకాండమును జేసి కడముట్టకెల్ల
(దు) బలుపుగల దుఃఖములపాలై బడలి సద్గురుకరుణజేసి
సలలితాంఘ్రులు గాంచగోరితి సామి యింత పరాకికేటికి
దురితులలోఁగడు దుష్టుడనైతిని కరుణచే దాససంగతి గల్గి వడ నీ
(దు) భరముగల సంసృతిని విడి యీతరిని శ్రీనరసింహదాసా
ఖ్యరసిక జనములు నిల్ప ధన్యతగాంచితిని భద్రాద్రి శ్రీరఘు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raamaa nii veMdunnavaaDavoo bhaktaraaji raxaNamunu buunavoo - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )