| కీర్తనలు | తూము నరసింహదాసు | రామా నీదయ రాదా పూర్ణకామా నీమది లేదా |
| మాంజి - ఆది |
| పల్లవి: |
| రామా నీదయ రాదా పూర్ణకామా నీమది లేదా |
| అనుపల్లవి: |
| సజలజలదశ్యామా జగదభిరామా భద్రాద్రిధామా యోరఘు |
| చరణము(లు): |
| ఏల నాతో జల మేల కరుణాలవాల దాసపరిపాలా యోరఘు |
| వాదా నీకృప లేదా సమయము గాదా యిది మరియాదా యోరఘు |
| భూషానవరతతోషా నరసింహపోషా మానుషవేషా యోరఘు |