కీర్తనలు తూము నరసింహదాసు శరణాగత పోషణా దాసర్చిత
బిలహరి - చాపు
పల్లవి:
శరణాగత పోషణా దాసర్చిత
చరణ సద్గుణసాగరా
అనుపల్లవి:
దరి నీవే యని వేడ దయ జూడరాదా
కరుణతో రక్షింప గతి వీవెకాదా
చరణము(లు):
పిలిచిన పలుకవు బిరు దదిగాదా
యలుక లేటికి ప్రోవ వది మరియాదా
పగవాని రమ్మని పాలింపలేదా
అగడుచేసిన నీకే అపకీర్తిగాదా
మనవి దెల్పినను నీమది జాలిగాదా
ఘనముగ రక్షింప గడుదయరాదా
వరభద్రాచల రఘువర యాది లేదా
యరసి రక్షించుట కది నీవెకాదా
కరిమొర విని వేగ గరుణించ లేదా
కరుణతో నరసింహు గరుణింప రాదా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - sharaNaagata pooShaNaa daasarchita - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )