కీర్తనలు తూము నరసింహదాసు కాచి ప్రోచిన మంచిదే
బిలహరి - చాపు
పల్లవి:
కాచి ప్రోచిన మంచిదే
నాచేతను గాదన్న మఱిమంచిదే
అనుపల్లవి:
ఆచి చూచి నాథ నరసి నే నిన్నాళ్లు
దాచుకొన్న దొడ్డధనము చందమున
చరణము(లు):
బాలుఁడు వీడు నీపాలబడ్డందుకు
నేలుకొన్నను ఖ్యాతి చాలగల్గుగాని
పతితుల బ్రోచెడి పంతము దెలిసెను
అతిమోదమున నన్ను నాదరించిన జాలు
నమ్మిన విడనాడు న్యాయము దెలిసిన
సమ్మతితోడ సీతమ్మనైన గొలుతు
కూరిమితో తూము నారసింహుని బ్రోచు
భారము నీదని పలుమారు వేడితి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - kaachi proochina maMchidee - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )