కీర్తనలు తూము నరసింహదాసు రాముని నమ్మితి నా దేహము స్వామి కమ్మితి
కాంభోజి - ఆది
పల్లవి:
రాముని నమ్మితి నా దేహము స్వామి కమ్మితి
కామకోటి సుందరాకారుడైన శ్రీభద్రాచల
చరణము(లు):
క్షయము లేనిది పారుష్యము లేనిది
భయము లేనిది యొకరికి బాధగానిది
గావున పయనమై పావనమౌ న
క్షయపాత్ర నాధారము చేసుక
ముజ్జగంబుల కెల్లను మోదమైనది
సజ్జనజీవనము సంసారతారకము
లజ్జవీడము భక్తలక్షణయోగము కాళ్ళను
గజ్జకట్టి తంబూర ఘనముగ బట్టి స్మరణజేయుచు
భాసురమైనది భద్రాద్రీశునికొలువిది
మోసము లేనిది భక్తమోక్షప్రద మిది
వాసవాదుల కెల్లను వంద్యమైనది
వాసిగాను నరసింహదాసు డనుపేర బరగి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raamuni nammiti naa deehamu svaami kammiti - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )