కీర్తనలు తూము నరసింహదాసు స్వామి నా మొర వినకున్నావేమి - రామస్వామి
భైరవి - ఆది
పల్లవి:
స్వామి నా మొర వినకున్నావేమి - రామస్వామి
కామజనక సుత్రామవినుత సుమదామ భద్రగిరిధామ రామ
చరణము(లు):
చలవా పిలిచిన పలుకవు ని - శ్చలమా - అలుక లేల భవ
జలధిలోన నే నిలుకడ దప్పి - నిను బలుకరించితిని
ఘనమా నను బ్రోవవె యిది - దొరతనమా మును నీ కథలెల్ల వినమా
చనువు మీరి నే వినయముతోడుత - బనివిని నీమృదుపదములు గొలిచితి
భారమా నను బ్రోచుటకును దు - స్తరమా అరచేసిన నాతరమా
సిరు లిడి శ్రీనరసింహదాసు నను - కరుణబ్రోతువని కడు నమ్మితి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - svaami naa mora vinakunnaaveemi - raamasvaami - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )