| కీర్తనలు | తూము నరసింహదాసు | ఏదిరా నీదయ రాద నాపై |
| సౌరాష్ట్ర - ఆది |
| పల్లవి: |
| ఏదిరా నీదయ రాద నాపై |
| అనుపల్లవి: |
| ముదముగదుర మృదుపదములు నామది సదయత వేడితి సామజవరద |
| చరణము(లు): |
| ప్రేమతో జూడర స్వామి పరాకేలర రామా యని నే వేమరు మొఱ లిడ కామిత మొసగవె కాంచనచేలా |
| యేలర యీచల మేలర నాతో మేలురా న న్నేలుటిదే జాలురా శ్రీసీతాలోలా |
| వాసిగ వరదరామదాస వికాస ఆశ శ్రీనివాస భద్రాచలదాస మానసాభితోషా |