కీర్తనలు తూము నరసింహదాసు పూజ చేతాము రారె శ్రీరాముల
కేదారగౌళ - చాపు
పల్లవి:
పూజ చేతాము రారె శ్రీరాముల
పూజ చేతాము రారె పుండరీకాక్షుని పదపద్మములకు పన్నీరు పువ్వుల
చరణము(లు):
నవరత్న పళ్లెముల నవనవలాడెడు
నవతులసీ దళములు నయముతోడుత తెచ్చి
గొజ్జంగి రేకులు ఘనమైన కమలములు
కాంతి చేమంతులు కడువేడ్కతో దెచ్చి
మొల్ల సుగంధములు కొల్ల దెచ్చిన
మల్లెపువ్వులు మంచి మందారపుష్పముల
వరభద్రగిరియందు వరదరామదాసుని
హృదయ కమలమున నునికి జేసియున్నాడు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - puuja cheetaamu raare shriiraamula - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )