కీర్తనలు తూము నరసింహదాసు నారాయణ నారాయణ నారాయణ హరే
కేదారము - రూపక
పల్లవి:
నారాయణ నారాయణ నారాయణ హరే
నారాయణ ఘనముని నారాయణ శౌరి
చరణము(లు):
కరుణాకర శరణాగత భరణా మృదుచరణా
అరుణారుణ బింబాధర చరణా భవహరణా
కస్తూరి మదరేఖారచన ముఖశోభా
మస్తకమకుటాంగద మోహా శుభరేఖా
వరభద్రాచలవాసా వరమృదుగుణభూషా
వరదరామదాసాన్వయ భూషాఖిలవేషా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - naaraayaNa naaraayaNa naaraayaNa haree - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )