కీర్తనలు తూము నరసింహదాసు సీతారామయ్య వైకుంఠమునకు బోవుచున్నాము రామ
కేదార - ఆది
పల్లవి:
సీతారామయ్య వైకుంఠమునకు బోవుచున్నాము రామ
భూతలమున దాసులకు ప్రీతితో దండము బెట్టి
చరణము(లు):
కాళ్ళకు గజ్జలు గట్టి ఘనముగ తంబుర బట్టి
మేలిమితో భద్రాద్రిరాముల మఱవక చూచుచు మేము
మోదముతో గోదావరి నాధారము జేసికొని
సాధుజనుల వెంబడి మేము సరగున శ్రీరాములగూడ
వాసిగాను వరదరామదాసుని వెంబడి మేము
రోసి వాంఛలు కోసివేసి రాముల జూడ
కూరిమితోడుత తూము నరసింహదాసులము
ధారుణి సురులకు మేము దండము దండము లిడుచు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - siitaaraamayya vaikuMThamunaku boovuchunnaamu raama - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )