కీర్తనలు తూము నరసింహదాసు శ్రీమద్భూమిసుతామనః కుశేశయ దివాకరం
చూర్ణిక
శ్రీమద్భూమిసుతామనః కుశేశయ దివాకరం
దశవదనముఖ కమల నిశాకరం - సౌజన్యగుణమణిరత్నాకరం - భక్తజనవశీకరం
త్రిభువన సుధాకరం సనక సనందన సంసేవిత శరణారవిందం - సచ్చిదానందం
గోవిందం విబుధజనపరివృత మునిజనానందం - శ్రీముకుందం - అరుణారుణ
కోటితుల్యప్రభామకుట కంఠాభరణ నీలజీమూత సమాన వైభవ సుందరాంగం
కరుణాపాంగం - దాసదాస నిజదాస హృత్కమల వికాసం - మునిజన మనోల్లాసం
భాసురమందహాసం - శ్రీభద్రాచల నివాసం - స్మరకోటివిలాసం - త్రిపురహర
విరించి నారదాది మునీంద్రస్తుత దివ్యసుందర వేషం - మృదుమధురభాషం
శ్రీరఘుకులభూషం - నారసింహదాసపోషం - భజేహం
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - shriimadbhuumisutaamanaH kusheeshaya divaakaraM - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )