కీర్తనలు తూము నరసింహదాసు శ్రీరామ జయరామ శ్రీసీతారామ
హెచ్చరిక (రూపక)
శ్రీరామ జయరామ శ్రీసీతారామ - శ్రీరఘుకులసోమా శ్రితకామా
కస్తూరితిలకాంకితఫాలా మునిలోలా - ఘనకాంచనచేలా సుకపోలా
సరయూతీరవిహారా శరనిధిగంభీరా - సురరాజాచలధీరా నరవర
రఘువీరా రణశూరా రమణీయహారా - మఘవైరివిదారా సుకుమారా
వామాంకస్థిత సీతా సౌమిత్రి సమేత - కామారివినుతా ఘనలలితా
రంగా రిపుమదభంగా ఖగరాడ్తురంగా - సంగరహిత జనహృన్నీలభంగా
శ్రీభద్రాచలవాసా శ్రీ శ్రీనివాసా - శుభకర నిజదాసా నీశవాసా
వరగుణ సురనరసేవితచరణా భవహరణా - వరదరామదాసాశ్రితభరణా
వందిత సనకసనందా నందిత మునిబృందా - కుందరదన గోవిందా ముకుందా
శ్రీరామ జయరామ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - shriiraama jayaraama shriisiitaaraama - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )