| కీర్తనలు | తూము నరసింహదాసు | శ్రీమత్సమస్త భూపాలజాల సుందరీసందోహసుందర |
| చూర్ణిక |
| శ్రీమత్సమస్త భూపాలజాల సుందరీసందోహసుందర నిటలసమగ్ర కుంకుమస్ఫుట విలక్షణలక్షణ చరణారవింద మైథిలీ శాతకుంభ కుంభత్కుచ కుంభ సంభరిత మృగమదసార ఘనసార కాశ్మీరచందన పటీర కర్దమాంకిత వక్షఃప్రదేశం - సుప్రకాశం॥ |
| వేదండతుండాయమాన వేదండతుండాయమాన దోర్దండఖండ మండితశౌర్య మహోద్దండ సంధానకాండ పాండిత్యదండన కృతభండన రిపుమండలం - గండస్థల ప్రతిబింబిత వక్రీకృతకుండలం॥ |
| చిత్రరత్నచామీకరయుత మకుట కటకాంగుళీయక మంజీర హారకేయూరముఖ మణిభూషణ ధగద్ధగాయమాన కోటికోట్యర్క తృణీకృతచరణ విరాజితం - భవనిర్జితం॥ |
| సమస్తమునిజన హృత్కమల కర్ణికాంతరవసంతం - చంద్రానన విరాజితం - ఖరాసుర విరాధ దశకంధరముఖ్య నిశీధినీచర నఖర రణరంగ విదారన కారణ అనివార్య శౌర్యధైర్యం - సాగరసమాన గాంభీర్యం॥ |
| సకల జగజ్జన సంస్తూయమాన తారకనామ మహామంత్రరాజ స్వరూపం - వరగుణ కలాపం॥ |
| ధర హిమధర శతతార తారకానికర నీహార హీరడిండీర ఘనసార మరాళపటీర వియజ్ఝరీ హరిహయైరావణ శరకుసుమ విసర శరత్సమయ ధరాధర హలధర, శారద, నారద, పుండరీక, కుండలీశ, పాండురరుచి నిరసన యశోవిశాల దశదిశాభాగం - మహోన్నతభోగం॥ |
| శుక, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, నారద, కశ్యప, విశ్వామిత్ర, పరాశర, వ్యాస, శౌనక, వశిష్ట, వల్మీకభవ ప్రముఖ ఋషిస్తుత చరిత్రం - మహేంద్రనీలోత్పలనిభగాత్రం॥ |
| వివిధ రుచిర ఘనమందిర కుడ్యోపరిభాగ విరచిత నానావర్ణ మంజులతర సాలభంజికా పుంజరంజిత విచిత్రనూతన రంభాస్తంభాయమాన చతుర్ద్వార మరకతమణి బంధతోరణ మాలికాలంకృత సభామంటప ప్రదేశ గారుడోపల పుష్యరాగ ఖచిత సింహాసనాసీనం - కౌస్తుభ భద్రాయమానం॥ |
| శ్రీమత్సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సుగ్రీవ విభీషణాంగద జాంబవత్ప్రముఖ పరివారసమేత పట్టాభి రామచంద్రదేవం - దేవదేవం॥ |
| సమస్త రాజాధిరాజ కోటీరఘటిత మణిరాజరాజ నీరాజనకృత విరాజిత పదరాజీవం - కరుణారస స్వభావం॥ |
| అనూనగాన వేణు వీణానినాద మృదందతాళ నృత్యవాద్య వైఖరీ వినోద తూము నృసింహదాసాభిధాన విరచిత గద్యపద్యానవద్య విద్యానవరత హృద్యం - వేదాంతవేద్యం - మమ కులదైవతం - మమ జనకం - మమ భక్తిముక్తిప్రదం - శ్రీభద్రాచల ధామం - నిరంతర మహం నమస్కరోమి॥ |