| కీర్తనలు | తూము నరసింహదాసు | నిస్తుల వజ్రోపలస్థగిత శాత కుంభ |
| చూర్ణిక |
| నిస్తుల వజ్రోపలస్థగిత శాత కుంభ కుడ్య వేదికా కవాటార్గళ వాతాయనే! మరకతమణినిబిడ తోరణమాలికాలంకృత ద్వారభుజంగే! నిరంతర మంగలాచార కలిక సాధ్వీజన సంసిక్త గంధసార కస్తూరికా కాశ్మీరజన్మ కర్దమ వినివారిత నిజసందర్శనాగత నానాదేశ పరివృత భూషణ సంఘట్టన రజః పుంజ పింజరీ తరంగ వల్లీమతల్లీ విలాస భాసురే! నిబిడాంధకార పరివృత చరణామూల్యరత్న దీపికాడంబర విడంబమాన దర్పణాబింబిత చతుర్దిగ్రాజ సదనాంతరాళే! సుప్రతీకౌదార్య కథాలేఖన విచిత్రతర బహువిధ పటుతర పటవితాన మనోహరే! శ్రీసౌజ్ఞ శిఖరహరివాలుకాబీజ చంద్రరజ స్సుమనామేయ ఫలక్రముక తాంబూలవల్లీ చందన సంయుక్త ముద్గకౌమోదజల సంపూర్ణకనకాలుకే భర్మ నిర్మితడోలికా కలిత మరాళ శాల్మలీ తూలానల్పతల్ప శిరశ్చరణ పార్శ్వదేశోపధాన మానితసూన మల్లికాతల్పిత మృదుపర్యంకే! వైదేహ్యసహశయానం పతంగపుంగవయానం నవీన నాగవల్లీ పూగఖండ ముక్తాచూర్ణ తాంబూలఖాదితం! దళిత దితిసుతం పయోమండల శితశర్కరతోయ క్షీరాభ్యవహారం! శ్రుత్యంతవిహారం! సీతాసీమంతినీ కృత నికృత నీరాజనాద్యుపచారం! లక్ష్మీనరసింహ రామదాస హృన్మందిర విహారం! సకల జగద్భరణ జాగరూక నిద్రా ముద్రాభిరామం! శ్రీరామ మహం వందే!! |