కీర్తనలు తూము నరసింహదాసు కోసలాధీశ పంక్తిరథకృత పూర్వసుకృతఫల
చూర్ణిక
కోసలాధీశ పంక్తిరథకృత పూర్వసుకృతఫల పరిపాకభాగ్య విసృమర పుణ్యోదయ సదవతారః ।
నిఖిలజన నయనానంద కందళిత సుందర కౌమారః। విజయశ్రీ వదానత బుధ మనోరథ సాఫల్యబాల్యః।
అంఘ్రిపంకజ పరాగలేశ యోగజిత గౌతమ సంయమిప్రవర దుర్భరశాప సంతాప హరాహల్యః।
దివ్యప్రబంధానుసంతత పంచమహావాద్య నిర్ఘోషైః। పాయస గుడాద్య ముద్గాదన తింత్రిణీ ఫలరస
సర్వతిలతైల శాల్యన్న హృద్యానవద్య భోజ్యలేహ్య చోష్య పానీయ భుక్తా విశిష్ట పదార్థ పవిత్రీకృత
సమస్తచేతన విదుర్మద దనుజ నిబిడ తమః ప్రద్యోతనః। భద్రగిరి వరశిఖర సౌధాంతర విహారః।
శ్రీ రఘువీరః। లక్ష్మీనృసింహ రామదాసాభీష్టదః। కుందకోరకరదః। అస్మాన్‌ రక్షతు॥
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - koosalaadhiisha paMktirathakR^ita puurvasukR^itaphala - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )