కీర్తనలు త్యాగరాజు అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు
సరస్వతి - రూపకం
పల్లవి:
అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అ..
అను పల్లవి:
ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకేగాని అ..
చరణము(లు):
వగవగగా భుజియించువారికి తృప్తియౌరీతి
సగుణధ్యానముపైని సౌఖ్యము త్యాగరాజనుత అ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - anuraagamu leeni manasuna suj~naanamu raadu ( telugu andhra )