కీర్తనలు త్యాగరాజు ఆనంద సాగర మీదని
గరుడ ధ్వని - దేశాది
పల్లవి:
ఆనంద సాగరమీదని దే
హము భూమి భారము; రామ! బ్ర ॥హ్మానంద॥
అను పల్లవి:
శ్రీనాయకాఖిల నైగమా
శ్రిత సంగీత జ్ఞానమను బ్ర ॥హ్మానంద॥
చరణము(లు):
శ్రీ విశ్వనాథాది శ్రీకాంత విధులు
పావన మూర్తు లుపాసింప లేదా?
భావించి రాగ లయాదులఁ
భజియించు శ్రీత్యాగరాజనుత ॥ఆనంద॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - aanaMda saagara miidani ( telugu andhra )