కీర్తనలు త్యాగరాజు ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా?
పున్నాగవరాళి - చాపు
పల్లవి:
ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా? ॥ఇంత॥
అను పల్లవి:
చింతనీయ! శ్రీరాఘవ! నిను మదిఁ
జింతించు సుజనుల పూజించినవారి ॥కింత॥
చరణము(లు):
మతిహీనులైన, నెమ్మతిలేనివారైన
నతి పాపకృతులైన, నెన్నటికి స
ద్గతిరానివా రైన, శ్రీరామ! శ్రుతి పురాణ నుత!
ప్రతిలేని నిన్ను సన్నుతి సేయు భక్తుల జతఁగూడిన వారి ॥కింత॥
సారెకు మాయ సంసారమందు చాల
దూరినవారైనఁ, గామాదులు
పూరిత మతులైన, సకల వేదసార! నిన్ను మన
సార నమ్మిన సుధాపూర చిత్తుల సేవఁ గోరినవారి ॥కింత॥
భర్మ చేల! నీదు మర్మముఁ దెలియని
కర్మమార్గులైన, త్యాగరాజ నుత!
ధర్మరహితులైన, లోకములు నిర్మించిన నీదు
శర్మము స్మరియించు నిర్మల మతుల శర్మమొంచినవారి ॥కింత॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - iMta bhaagyamani nirNayiMpa brahmeeMdraadula taramaa? ( telugu andhra )