కీర్తనలు త్యాగరాజు ఈ వరకు జూచినది చాలదా? యింక నా రీతియా?
శంకరాభరణం - ఆది
పల్లవి:
ఈ వరకు జూచినది చాలదా? యింక నా రీతియా? ॥ఈవరకు॥
అను పల్లవి:
పావనము సేయు శక్తి కణగని
పాపము గలదా కరివదన న ॥న్నీవరకు॥
చరణము(లు):
శ్రీశరణా శుగాశన శయన ప
రేశ నీ పద కుశేశ యార్చనము
నే సేయక దురాశ చే భవపాశ
బద్ధుఁడై గాసి తాళని న ॥న్నీవరకు॥
పరలోక భయ విరహితులైన
నరులు నాదుపై మఱి యసూయల
బఱచిన బాధలు తరముగాక నీ
చరణ యుగములను శరణొందిన న ॥న్నీవరకు॥
నాగాశన సదాగమన ఘృణా
సాగర నిన్ను వినా యెవరు నీ
వే గతియని వేవేగ మొఱలనిడు
త్యాగరాజుని రాగరహిత నీ ॥నీవరకు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ii varaku juuchinadi chaaladaa? yiMka naa riitiyaa? ( telugu andhra )