కీర్తనలు త్యాగరాజు ఊరకయే కల్గునా రాముని భక్తి
శహాన - చాపు
పల్లవి:
ఊరకయే కల్గునా రాముని భక్తి ॥ఊరక॥
అను పల్లవి:
సారెకును సంసారమున జొచ్చి
సారమని యెంచు వారి మనసున ॥నూరక॥
చరణము(లు):
ఆలు సుతులు జుట్టాలు వర ద
నాలు గాయ ఫలాలు కనక ధ
నాలు గల విభవాలఁగని యస్థి
రాలను భాగ్య శాలులకుఁ గాక ॥యూరక॥
మంచి వారిని బొడగాంచి సంతతము సే
వించి మనవి నాలకించి యాదరి సా
ధించి సర్వము హరియంచుఁ దెలిసి భా
వించి మదిని పూజించు వారికి గాక ॥యూరక॥
రాజసగుణ యుక్త పూజల నొనరించ
గజ సన్నుత! త్యాగరాజుని జిహ్వపై
రాజిల్లు వర మంత్ర రాజసమునును స
దా జపించు మహారాజులకు గాక! ॥యూఅరజ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - uurakayee kalgunaa raamuni bhakti ( telugu andhra )